![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -288 లో.. బతుకమ్మ సెలబ్రేషన్స్ దగ్గరికి కలెక్టర్ వస్తాడు. నర్మదని గుర్తుపట్టి.. నువ్వు బెస్ట్ ఎంప్లాయి అవార్డు తీసుకున్నావ్ కదా అని నర్మద గురించి గొప్పగా మాట్లాడుతాడు. నర్మద తన కుటుంబాన్ని కలెక్టర్ కి పరిచయం చేస్తుంది. అతను మా మావయ్య చాలా మంచివాడు.. సొంతంగా కష్టపడి పైకి వచ్చాడని చెప్తుంది. మీలాంటి వాళ్ళు అందరికి ఆదర్శమని రామరాజుతో కలెక్టర్ అంటాడు.
ఆ తర్వాత పాప దొరికిందని పోలీసులు కలెక్టర్ కి చెప్తారు. పాప కి ఇష్టమైన పాట పాడి.. ఆ అమ్మాయి దొరికేల చేసిందని పోలీసులు ప్రేమని కలెక్టర్ కి చూపిస్తారు. ప్రేమని కలెక్టర్ మెచ్చుకుంటాడు. తను నా తోటికోడలు అని నర్మద అనగానే వెరీ గుడ్.. ఇద్దరు కోడళ్ళు మీ మావయ్య గారి పరువు నిలబెడుతున్నారని కలెక్టర్ గొప్పగా మాట్లాడుతాడు. అదంతా విని వేదవతి హ్యాపీగా ప్రేమ, నర్మదలని పట్టుకొని ముద్దాడుతుంది. అదంతా చూసి శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. నాకు అవమానం జరిగిందని చెప్తుంది.
మరొకవైపు మీరు కోడళ్లని తప్పుగా అపార్థం చేసుకున్నారు. వాళ్ళు మీ పరువు నిలబెడుతారని రామరాజుతో వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి నీ ప్రేమ విషయం చెప్పమని నర్మద ఎంకరేజ్ చేస్తుంది. కాసేపటికి ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. తన లవ్ గురించి చెప్తుంటే ప్రేమ మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |